ఇండస్ట్రీలో పోటీ అనే పదం నాకు వర్తించదు - kalyani malik interview
close
Published : 16/02/2021 19:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇండస్ట్రీలో పోటీ అనే పదం నాకు వర్తించదు

సంగీత దర్శకుడు కల్యాణిమాలిక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఊహలు గుసగుసలాడే’తో గొప్ప గాయకుడు, సత్తా ఉన్న సంగీత దర్శకుడు అనడంలో ‘ఏం సందేహం లేదని’ నిరూపించారు కల్యాణి మాలిక్‌. ‘ఆంధ్రుడు’, ‘అష్టాచమ్మా’, ‘అలా మొదలైంది’ సినిమాలకు బాణీలు అందించి క్లాసికల్‌ హిట్స్‌ కొట్టి, ఆలపిస్తూ.. అలరిస్తూ.. వస్తున్నారు. ప్రస్తుతం నితిన్‌ హీరోగా వస్తున్న ‘చెక్‌’ చిత్రానికి ఆయన సంగీతం సమకూర్చారు. తనను ‘ఐతే’తో సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 26న థియేటర్‌లలో విడుదల కానుంది. ఈనేపథ్యంలో కల్యాణి మాలిక్‌ మీడియాతో ముచ్చటించారు. 

మీకు అవకాశాలు ఎందుకు రాలేదు..?
‘అలా మొదలైంది’ వంటి హిట్‌ వచ్చిన తర్వాత కూడా నాకు అవకాశాలు రాలేదు. సినిమాల కోసం చాలా ప్రయత్నించాను. కానీ, ఎక్కడా అవకాశం దొరకలేదు. దానికి కారణం ఏంటో నాకూ తెలియదు. దేనికైనా సమయం రావాలి అనుకుంటున్నా. అయితే.. ఈ సినిమా తర్వాత అలాంటి ఎదురుచూపులు ఉండవని నమ్ముతున్నా.

పదిహేడేళ్లుగా మళ్లీ చందు(చంద్రశేఖర్‌ ఏలేటి)తో కలిసి ఎప్పుడు పనిచేద్దామా అని ఎదురు చూస్తున్నాను. నా బలం, బలహీనతలు తెలుసుకోవడానికి ఈ  కాలం బాగా ఉపయోగపడింది.  తొలి సినిమా చేసినప్పుడు పని విషయంలో ఎలాంటి భయం, భక్తి ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఆ విషయంలో ఎలాంటి మార్పూ లేదు. ఆంధ్రుడు, అష్టాచమ్మా, ఊహలు గుసగుసలాడే సినిమాలు నా కెరీర్‌లో మంచి సినిమాలు. అలాగే ప్లాఫ్‌ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే.. నా సినిమాల్లో బ్లాక్‌బస్టర్‌లు రాలేదు. వెలుగులోకి వచ్చి సినిమా తర్వాత సినిమా చేసే అవకాశం వచ్చిన సందర్భాలూ నా కెరీర్‌లో లేవు. ‘చెక్‌’ మాత్రం నా కెరీర్‌లో పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నమ్మకం ఉంది.

ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్‌ ఫ్యాక్టర్స్‌ ఉన్నాయి. చందు ఒక విచిత్రమైన కథను ఎంచుకున్నాడు. ఈ సినిమాలో జైల్లో అందర్నీ ఆకట్టుకనే సీన్లు ఉంటాయి. నితిన్‌ కూడా అద్భుతంగా నటించారు. చందు ఇలాంటి సెమీ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమాను చేయడం నాకు తెలిసి ఇదే మొదటిసారి. సినిమాకు వెళ్లిన వాళ్లు మాత్రం థ్రిల్‌ అవడం పక్కా. ఈ సినిమాలో ఒకటే పాట ఉంటుంది. 

సినిమాలో ఒకే పాట. మీరు అభ్యంతరం వ్యక్తం చేయలేదా..?

ఒక్కపాట పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసే స్థితిలో నేను లేను. అవకాశం వస్తే చాలు అనేది పరిస్థితి నాది. వచ్చిన ఒక్క పాటనే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అయినా ఐదు పాటలు ఉండేదానికంటే.. ఒకే పాట ఉంటే ఎక్కువ ఏకాగ్రతతో పనిచేస్తాం. ఇంకో పాటలో చూసుకుందాంలే అనే అవకాశం ఉండదు. ఒక్కపాట ఉండటం అనేది సంగీత దర్శకులకు ఒక సవాల్‌. నా కెరీక్‌ గ్రాఫ్‌ మీక్కూడా తెలుసు. 17ఏళ్లలో కేవలం 16 సినిమాలు మాత్రమే చేశాను. సంవత్సరానికి ఒక సినిమా చొప్పున మాత్రమే చేశాను. అలాంటప్పుడు ఫలానా సినిమా మాత్రమే చేస్తాను అని నేనెలా చెప్పగలను..?

టాలెంట్‌ ఉన్నా తక్కువ స్థాయిలో ఉన్నానని ఫీల్‌ అవుతున్నారా..?

ఈ ప్రశ్నకు సరైన సమాధానం నా దగ్గర లేదు. టాలెంట్ అనేది నంబర్లు కాదు.. క్వాలిటీతో ముడిపడి ఉంటుంది. ఏ సినిమా చేసినా హిట్‌ కావాలని, మంచి పేరు తేవాలని కోరుకుంటాం. అదేస్థాయిలో కష్టపడి పనిచేస్తాం. అలా చేసినప్పుడే తర్వాత సినిమా అవకాశాలు వస్తాయి. సినిమా మన జీవనాధారం కాబట్టి కష్టపడి పనిచేస్తాం. 

ఈ సినిమాకు ఎక్కువ రోజులు కష్టపడ్డా..

నా కెరీర్‌లో ఎక్కువ రోజులు పనిచేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇదే. దాదాపు 30 రోజులకుపైగా పట్టింది. 75 ట్యూన్స్‌ చేశాను. 20 వరకూ చరణాలు చేశాను. అయితే.. మనం ఎక్కువ ట్యూన్స్‌ చేయడం.. లేదా ఎక్కువ పని చేశామా అన్నది ముఖ్యం కాదు. క్వాలిటీ ముఖ్యం. ఈ సినిమాలో కథకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా ఉపయోగపడింది. నాకూ మంచి పేరు తెచ్చిపెడుతుంది. నితిన్‌ చాలా సన్నిహితంగా ఉంటారు. ఫోన్‌ చేసి పని ఎలా సాగుతుందని అడిగేవారు. అలాంటి నితిన్‌తో కలిసి చేస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుతున్నా.

‘బాహుబలి’కి ‘కీరవాణి’తో కలిసి పనిచేసిన అనుభవం..?

‘బాహుబలి’కి సౌండ్‌మిక్సింగ్‌లో పనిచేయడం నాకు ఒక మధురమైన జ్ఞాపకం. ‘ధీవర’ సౌండ్‌ మిక్స్‌ ముంబయిలో చేశాం. ఆ సమయంలో రాజమౌళి, కీరవాణి(అన్నయ్య), నేనూ ఉన్నాం. అవుట్‌పుట్‌ ఎలా వస్తుందన్న భయం వాళ్లకంటే నాకే ఎక్కువగా ఉంది. ఆ సందర్భం ఇప్పటికీ గుర్తుంది. పాట మొత్తం విన్న తర్వాత బయటికి వచ్చాం. దేన్నీ అంత సులభంగా మెచ్చుకోని రాజమౌళి నన్ను కౌగిలించుకొని రెండున్నర సంవత్సరాల భయం తొలగిపోయిందన్నారు. అదే నా జీవితంలో గొప్ప ప్రశంస. సౌండ్‌కు అంత విలువ ఇస్తాడు.

డైరెక్టర్‌, ఆర్టిస్టులు సహకరిస్తేనే విజయం సాధ్యం

సినిమా బాగాలేకపోయినా నేను బాగా చేశాననేది అబద్ధం. నాకు వచ్చిన హిట్లు కూడా డైరెక్టర్‌, ఆర్టిస్టులు బాగా సహకరిస్తే వచ్చినవే. వాళ్లు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేది కాదు. ప్రతి ఒక్కరి సూచనలను స్వీకరించినప్పుడే మనం ముందుకువెళ్లగలం. ఈ సినిమాకు పనిచేసేటప్పుడు డైరెక్టర్‌ చందు కూడా నాకు ‘ఇది ఇలా ఉంటే బాగుంటుంది..’ అని సూచనలు చేసేవాడు.

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ప్రభావం సినిమాపై ఎలా ఉంటుంది..?

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వల్ల సినిమా సూపర్‌హిట్‌ చేయవచ్చు. నాశనం కూడా చేయవచ్చు. అయితే.. మనం ఏం చేయాలనుకున్నా సినిమా కంటెంట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. చివరికి డైరెక్టర్‌ అనే వాడు కెప్టెన్‌. ఒకవేళ రేపొద్దున్న నాకు మంచి పేరు వస్తే ఆ గొప్పతనం డైరెక్టర్‌ చందుకే దక్కుతుంది.

పాటల కోసం ఎవరైనా సంగీత డైరెక్టర్లు మిమ్మల్ని అడిగారా..?

నాకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. చాలా మందిని అడుగుతూ ఉంటాను. పాటలు పాడే అవకాశం ఇవ్వమని దాదాపు రెండువేల సార్లు అడిగి ఉంటా. అలా అడుగుతున్నందుకు నేనేం చిన్నబుచ్చుకోను. ఒక పాట పాడిన తర్వాత వచ్చే అనుభూతిని వర్ణించలేం. ‘సూపర్‌ మచ్చి’ సినిమాలో తమన్‌ ఒక పాట పాడే అవకాశం ఇచ్చారు. బాగా పాడారని ఆయన కూడా ప్రశంసించారు. 

సంగీత దర్శకులు స్నేహపూర్వకంగా  ఉంటారా..?

మణిశర్మగారి అబ్బాయి సాగర్‌మహతి నాకు చాలా సన్నిహితుడు. తమన్‌తో కూడా చనువుగా ఉంటాను. అయితే.. ఒకరి పాటను ఒకరు పొగడటం, ఫోన్లో మెసెజ్‌లు పెట్టడం కూడా ఉండదు. ఎవరి భయాలు వాళ్లకు ఉంటాయి. ఇంతకుముందు నాలుగురైదుగురు సంగీతదర్శకులు ఉండేవారు.. ఇప్పుడు వందలకొద్దీ మ్యాజిక్‌ డైరెక్టర్లు ఉన్నారు. అందుకే.. ఏ అవకాశం చేజారిపోతుందోనన్న భయంతో అలా ఉంటారనిపిస్తుంది. నేను మాత్రం బహిరంగంగానే ఉంటాను. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే సేఫ్ అనేది నా భావన. మా అబ్బాయికి కూడా నా పాటలకంటే తమన్‌ పాటలంటే చాలా ఇష్టం. మీరెందుకు తమన్‌లా కంపోజ్‌ చేయరు? అని చాలాసార్లు అడిగారు.

ఎంతో బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నప్పటికీ అవకాశం రాకపోవడం వెనక కారణం.?

అవకాశాలు వాటంతటవే రావాలి. మన క్యారెక్టర్‌ను, పనిని చూసి వస్తే బాగుంటుంది. కుటుంబాన్ని చూసి వచ్చే అవకాశాలపై ఎన్ని రోజులని బతుకుతాం. అందులో సంతృప్తి ఉండదు. సొంతంగా రాణించడమే నాకు ఇష్టం. నేను చేసిన పాటలు వింటుంటే నాకు గర్వంగా ఉంటుంది. సిగ్గుపడేలాంటి పాటలైతే ఎప్పుడూ చేయలేదు. నేను చేసిన రెండు వెబ్‌సిరీస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రైవేటు ఆల్బమ్‌ కూడా చేశాను. కానీ.. అది సక్సెస్‌ కాలేదు. మన దగ్గర ఆ కల్చర్‌ ఇంకా రాలేదు. 

మీ కుటుంబం నుంచి మరో సంగీత దర్శకుడు కాల భైరవ గురించి..?

తను గాయకుడిగా, సంగీత దర్శకుడిగా బాగా పనిచేస్తున్నాడు. ‘మత్తు వదలరా’తో ఇప్పటికే తనేంటో నిరూపించుకున్నాడు. ఇక రాబోయే సినిమాల్లో ఎంత బాగా చేస్తాడోనని అందరిలాగే నేను కూడా ఎదురుచూస్తున్నా.

చాలా సినిమాలు చేతి దాకా వచ్చి చేజారిపోయాయి. అందుకే నేను ముందే ఏదీ చెప్పను. తర్వాత బయటి నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి కదా.!

ఇండస్ట్రీలో మీకు పోటీ ఎవరు..?

నాకు ఎవరూ పోటీ కాదు. నేను కూడా ఎవరికీ పోటీ అని భావించట్లేదు. ఎందుకంటే నేను ఎక్కువ సినిమాలు చేస్తే ఎవరైనా పోటీగా భావిస్తారు. అసలు పోటీ అనే పదం నాకు వర్తించదు. నా బలం ఏంటో నాకు తెలుసు. తక్కువ సినిమాలు చేసినా ఇప్పటి వరకూ నిలబడ్డాను అంటే.. కారణం నాకు తెలుసు. ఇంకా నిలబడగలననే నమ్మకం ఉంది. 

కల్యాణి మాలిక్‌గా పేరు మార్చుకోవడం వెనక కారణం..?

ఏం లేదు.. అదో తిక్క అనుకోండి(నవ్వుతూ). అదే బెటర్‌. దాని వెనకాల ఎలాంటి కారణం లేదు. అదృష్టవశాత్తు ‘అలా మొదలైంది’ తర్వాత మార్చాను. అది హిట్‌ అయింది కాబట్టి సరిపోయింది.. లేకపోతే సినిమా ప్లాఫ్‌ అయింది కాబట్టే పేరు మార్చుకున్నాడని అనేవారేమో. న్యూమరాలజీ మీద కూడా నాకు నమ్మకం లేదు. ఆస్ట్రాలజీ(జ్యోతిషశాస్త్రం) అంటే ఇష్టం. పేర్లు మార్చడంపై నాకు ఎలాంటి నమ్మకం లేదు. అయితే.. అలాంటి నమ్మకం మా నాన్నగారికి ఉండేది. పాఠశాలలో ఉన్నప్పుడు కల్యాణ్‌వర్మ అని మార్చారు. మా స్కూల్‌ఫ్రెండ్స్‌ ఇప్పటికీ నన్ను వర్మ అనే పిలుస్తారు.

మీకు నచ్చిన సంగీత దర్శకులు‌..?

కె.ఎం.రాధాకృష్ణగారి సంగీతం నాకు బాగా ఇష్టం. అయితే ఆయన ఎక్కువ సినిమాలు చేయలేదు. ఆయన మరిన్ని సినిమాలు చేస్తే బాగుండేదని అనుకుంటా. చేతన్‌భరద్వాజ్‌ సంగీతం కూడా బాగుంటాయి. తమన్‌ పాటలు కూడా ఇష్టం.

‘చెక్‌’ నాకు పేరు మాత్రమే కాదు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది

ఏ డైరెక్టర్‌తో కలిసి పనిచేయాలని డ్రీమ్‌..?

అనిల్‌రావిపూడి. ఆయనకు మంచి టేకింగ్‌ ఉంటుంది. మంచి కథ పడితే టాప్‌ డైరెక్టర్‌ అవుతాడు. త్రివిక్రమ్‌, పూరి జగన్నాథ్‌తో కూడా కలిసి పనిచేయాలని కోరిక. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని