మారుతున్న తరాలకు ఆ సంగీతాన్ని అందిస్తా: ఇళయరాజా - ilayaraja about music
close
Published : 04/02/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మారుతున్న తరాలకు ఆ సంగీతాన్ని అందిస్తా: ఇళయరాజా

చెన్నై: మారుతున్న తరాలకు తన అద్వితీయ సంగీతాన్ని అందిస్తానని చెప్పారు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా. ప్రసాద్‌ స్టూడియోను ఖాళీ చేసిన తర్వాత ఆయన చెన్నైలో కొత్త స్టూడియోను నిర్మించారు. బుధవారం దీని ప్రారంభోత్సవం సందర్భంగా ఇళయరాజా విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు చెన్నైలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల చిత్రాలు నిర్మితమయ్యేవి. అప్పుడప్పుడు హిందీ చిత్రాలు కూడా నిర్మితమయ్యేవి. మరెక్కడా లేని స్థాయిలో చెన్నైలో స్టూడియోలు ఉండేవి. ఆసియా ఖండంలోనే విజయావాహిని స్టూడియో అతి పెద్దది. అది ఇప్పుడు లేదు. జెమిని, నెఫ్ట్యూన్, శారద, గోల్డెన్, విజయా గార్డెన్‌.. ఇలా చాలా స్టూడియోలు కనుమరుగయ్యాయి. ఆ జాబితాలో ప్రసాద్‌ స్టూడియో కూడా కనిపించకుండా పోవాలని నేను బయటకు వచ్చేశా. నా కష్టార్జితంతో ఈ కొత్త స్టూడియోను కొని రికార్డింగ్‌లు ఆరంభిస్తున్నా. చిత్రపరిశ్రమలో సుస్థిరంగా నిలిచింది నా సంగీతం. మారుతున్న తరాలకు ఆ అద్వితీయ సంగీతాన్ని అందిస్తా. వెట్రిమారన్‌ దర్శకత్వంలోని చిత్రంతో ఈ స్టూడియోలో సంగీతానికి శ్రీకారం చుడుతున్నానని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

ఆ వార్తలు చూసి షాకయ్యా: శంకర్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని