మళ్లీ కెమెరా ముందుకు.. కొత్తగా ఉంది - i went through clinical depression laxmi raai
close
Published : 18/03/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మళ్లీ కెమెరా ముందుకు.. కొత్తగా ఉంది

రాయ్‌లక్ష్మీ

హైదరాబాద్‌: తన చివరి చిత్రం ‘వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి’లో అందంతో పాటు అభినయాన్ని ప్రదర్శించి కుర్రకారును ఆకర్షించిన రాయ్‌లక్ష్మీ మళ్లీ కెమెరా ముందుకొచ్చింది. అందరికి గతేడాది కొవిడ్‌ వల్ల రోజులు భారంగా గడిస్తే, తనకు వీటితో పాటు తండ్రీ మరణం తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని వాపోయింది. తాజగా ఆమె ఓ మహిళా ప్రధాన చిత్రంలో పవర్‌ఫుల్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

‘చాలాకాలం తర్వాత కెమెరా ముందుకు రావడం కొత్తగా అనిపిస్తోంది. నటిగా నా కెరీర్‌ తొలి రోజులు గుర్తుకొస్తున్నాయి. ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఒక రివెంజ్‌ డ్రామా. మన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇందులో ప్రస్తావిస్తున్నాం. ముఖ్యంగా అత్యాచార బాధితులు, క్యాస్టింగ్‌ కౌచ్‌, అనేకచోట్ల మహిళలను వేధిస్తున్న సమస్యలపై న్యాయం కోసం పోరాడే పాత్ర నాది. అలాగే నా నిజ జీవితంలో గడిచిన ఏడాది ఒక పీడకల. నేను ఎంతో ప్రేమించే నాన్నగారు కాలం చేశారు. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన ఆరోగ్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగటం వల్ల నాకొక రకమైన ఒత్తిడి కలిగింది. నా ఫోన్‌.. ఆసుపత్రుల బిల్లులు, డాక్టర్స్‌ అపాయింట్‌మెంట్స్‌తో నిండిపోయింది. క్రమంగా పరిస్థితులు అర్థం చేసుకోవాటానికి ప్రయత్నిస్తున్నా. గడిచిన ఏడాది జరిగిన ఘటనలు.. మానసికంగా ఇంకెంత దృఢంగా ఉండాలనే విషయాన్ని నాకు బోధించాయి. ప్రస్తుతం మళ్లీ పనిలో బిజీ కావటం నాకు ఎంతో సంతోషానిస్తోంది ’అంటూ తన భావాలను వివరించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని