NARAPPA: అమెజాన్‌ ప్రైమ్‌లో ‘నారప్ప’? - gossips on narappa release date
close
Published : 28/06/2021 14:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

NARAPPA: అమెజాన్‌ ప్రైమ్‌లో ‘నారప్ప’?

రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘నారప్ప’ సినిమా కోసం సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 14న విడుదల చేయాలని చిత్రబృందం మొదట భావించినప్పటికీ కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా పరిస్థితులు తారుమారయ్యాయి. దీంతో సినిమా విడుదల వాయిదా పడింది. లాక్‌డౌన్‌ అనంతరం పూర్తిస్థాయిలో థియేటర్లు ఎప్పుడు తెరుచుకోనున్నాయనే విషయంలో స్పష్టత రాని కారణంగా ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్‌ చేయాలని చిత్రబృందం భావించినట్లు ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌కు ‘నారప్ప’ టీమ్‌తో డీల్‌ కుదిరిందని తాజాగా నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు వచ్చే నెలలో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ‘నారప్ప’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. జులై 24న ఈ సినిమా విడుదల కావొచ్చని అనుకుంటున్నారు. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ధనుష్‌ కథానాయకుడిగా కోలీవుడ్‌లో తెరకెక్కిన సూపర్‌హిట్‌ చిత్రం ‘అసురన్‌’కు రీమేక్‌గా ‘నారప్ప’ సిద్ధమైంది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేశ్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో వెంకటేశ్‌కు జోడీగా ప్రియమణి నటించారు. కుల వ్యవస్థ, భూ వివాదం.. వంటి సామాజిక అంశాలతో ఈ సినిమా చిత్రీకరించబడింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని