రాజమౌళి గారు.. రామాయణం చేయండి..!
close
Published : 03/05/2020 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజమౌళి గారు.. రామాయణం చేయండి..!

ట్విటర్‌లో ట్రెండింగ్‌

హైదరాబాద్‌: ఆసక్తికరమైన ట్విస్టులతో, ఆకట్టుకునే విజువల్స్‌తో సాధారణ కథను కూడా ప్రేక్షకులకు మెచ్చుకునే సూపర్‌హిట్‌ చిత్రంగా తెరకెక్కించడం దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి సొంతం. అయితే భారత ఇతిహాసాల్లో ఒకటైన రామాయణాన్ని రాజమౌళి వెండితెరపై ఆవిష్కరిస్తే చూడాలని సినీ ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యాన్ని ధారావాహికగా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు రామానంద సాగర్‌. 1987లో ప్రసారమైన ఈ సిరీయల్‌ను ప్రేక్షకుల కోరిక మేరకు లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం పునఃప్రసారం చేస్తున్నారు. దీంతో ఇటీవల ఈ  సీరియల్‌ ఎక్కువ మంది వీక్షకులతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. 

ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ట్విటర్‌ వేదికగా రాజమౌళి సర్‌.. రామాయణం చేయండి అని పేర్కొంటూ ట్వీట్లు చేస్తున్నారు. అందులో ఎన్టీఆర్‌ను రాముడిగా చూడాలనుకుంటున్నామని విజ్ఞప్తి చేస్తున్నారు. నెటిజన్లు చేస్తున్న వరుస ట్వీట్లతో #RajamouliMakeRamayan అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్ ఇండియా ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో దూసుకెళ్తోంది. అభిమానుల ట్వీట్లపై రాజమౌళి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే రాజమౌళి మాత్రం తాను తప్పకుండా ‘మహాభారతం’ సినిమా చేస్తానని చాలా సందర్భాల్లో ప్రకటించారు.

ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలని ఆశిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌, హాలీవుడ్‌ నటీనటులు సందడి చేయనున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి, మహేశ్‌బాబుతో సినిమా చేయనున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని