చిరు ఫస్ట్‌ ట్వీట్‌ అదే..!
close
Updated : 25/03/2020 17:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు ఫస్ట్‌ ట్వీట్‌ అదే..!

ట్విటర్‌లోకి అడుగుపెట్టిన మెగాస్టార్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి బుధవారం నుంచి ట్విటర్‌లోకి వచ్చారు. శ్రీ శార్వరి నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ట్విటర్‌ వేదికగా ఆయన ఫస్ట్‌ ట్వీట్‌ చేశారు. ‘అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. నా తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులతో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగడం ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం.’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. మెగాస్టార్‌ ట్విటర్‌లోకి అడుగుపెట్టిన కొన్ని క్షణాల్లోనే ఆయన్ని దాదాపు 12 వేల మంది ఫాలో అవుతున్నారు. 

గతేడాది విడుదలైన ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్‌ సందడి చేయనున్నారు. కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకాలపై రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి దేవదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపించనున్నారని సమాచారం. కరోనా కల్లోలం కారణంగా ప్రస్తుతానికి ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని