పట్టాలెక్కనున్న వెంకటేశ్‌ ‘అసురన్‌’
close
Published : 14/01/2020 12:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పట్టాలెక్కనున్న వెంకటేశ్‌ ‘అసురన్‌’

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: రీమేక్‌ సినిమాల స్పెషలిస్టు విక్టరీ వెంకటేశ్‌ నటించనున్న మరో చిత్రం ‘అసురన్‌’. జనవరం 20 నుంచి పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. తమిళ స్టార్‌ హీరో ధనుశ్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం అభిమానులను ఉర్రూతలూగించింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి రికార్డులు సృష్టించడంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. వెంకటేశ్‌ సోదరుడు సురేశ్‌బాబు సారథ్యంలోని సురేశ్‌ప్రొడక్షన్స్‌ ఈ సినిమా నిర్మించనుంది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించనుండగా ప్రియమణి హీరోయిన్‌గా చేయనుంది. మణిశర్మ సంగీతం సమకూర్చనున్నారు. అయితే, ప్రధాన పాత్రలో వెంకటేశ్‌ ఇప్పటికే ఖరారవగా.. మరో యువ హీరో కోసం వెతికే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు.

వెంకటేశ్‌ పక్కా పల్లెటూరి మాస్‌ మనిషిగా కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో రాయలసీమ ప్రాంతమైన అనంతపురం పరిసరాల్లో సినిమా చిత్రీకరించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. అక్కడ దాదాపు 30 రోజుల పాటు షూటింగ్‌ ఉంటుంది. సినిమా మొత్తం దాదాపు రెండు నెలల్లో పూర్తి చేయాలని సినిమా బృందం లక్ష్యంగా పెట్టుకుంది. అన్నీ అనుకూలిస్తే 2020 వేసవిలో విడుదల చేసేందుకు ఇప్పటి నుంచే ప్లాన్‌ వేస్తున్నారట. గత ఏడాది ఎఫ్‌2, వెంకీమామ సినిమాల విజయాలతో మంచి జోరుమీదున్న వెంకటేశ్‌ తీస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని