close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 31/03/2020 08:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

కాజల్‌ ‘కళరి’ ..దేవయాని ‘శిలంబం’ 

కొత్త విషయాలపై దృష్టిపెడుతున్న తారలు

చెన్నై: 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ అనగానే.. ‘అమ్మో.. ఇంట్లో ఎలా ఉండగలం. ప్రభుత్వాలకు పనిలేదా?’ అంటూ అవగాహన రహితంగా మాట్లాడుతున్నవారికి సినీతారలు తమవంతుగా అవగాహన కలిస్తున్న విషయం తెలిసిందే. ‘బయట తిరగకండి.. ఇంటి పట్టునే ఉండండి.. కరోనాను తరిమికొట్టండి’ అంటూ పిలుపునిస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఈ ప్రత్యేక రోజుల్లో ఇంట్లోనే ఉంటూ తాము చేస్తున్న పనులకు సంబంధించిన సమాచారాన్ని తారలు పంచుకుంటున్నారు. కొందరు తమ పిల్లలకు చదువు నేర్పుతూ గురువులుగా మారిపోయారు. పని మనిషితో నిమిత్తం లేకుండా తామే ఇంటి పనులన్నీ చక్కగా చేసుకుంటున్నారు. హీరోలు కూడా గరిటలు తిప్పేస్తున్నారు. ఇలా ఇంటి పట్టునే ఉంటూ అవగాహన కల్పించడంతో పాటు.. కొత్త విషయాలపై దృష్టి పెడుతున్న తారలపై ‘న్యూస్‌టుడే’ కథనమిది..
పరిశోధనపై దృష్టి..

‘సైవం’ చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి విద్య. ఆ తర్వాత అదిబర్, పసంగ 2, అచ్చమిండ్రి, ఇరవుక్కు ఆయిరం కణ్గళ్, కళరి, మారి 2, తడం తదితర చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ‘ఒత్తైక్కు ఒత్త’, ‘తలైవి’ చిత్రాల్లో నటిస్తోంది. వాస్తవానికి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడానికి ముందు ఈమె రీసెర్చి సైంటిస్టు. సినిమా అవకాశాలు రావడంతో పరిశోధనలను పక్కన పెట్టింది. ప్రస్తుతం సమయం చిక్కడంతో మళ్లీ స్టెమ్‌సెల్స్‌పై పరిశోధనలు మొదలు పెట్టింది. కొన్నిరోజులుగా పరిశోధనలను ప్రారంభించానని ఈ అమ్మడు సామాజిక మాధ్యమంలో ప్రస్తావించింది. అంతేకాకుండా ఈ ప్రవృత్తిని తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పింది.
వయసుతో సంబంధం లేకుండా.. 

కథానాయికగా తిరుగులేని క్రేజీని సంపాదించుకుని, బుల్లితెరపై కూడా మహిళల మన్ననలు అందుకున్న నటి దేవయాని. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా 144 సెక్షన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారలంతా ఇంటిపట్టునే ఉంటూ ప్రజలకు ఏదో రకంగా అవగాహన కల్పిస్తున్నారు. కొందరు కొత్త అంశాలు నేర్చుకోవడంపై దృష్టిపెడుతున్నారు. ఇదిలా ఉండగా నటి దేవయాని కుమార్తెలతో కలిసి శిలంబం విద్య నేర్చుకుంటోంది. అందియూర్‌ సమీపంలోని ఆలయంకాట్టు ప్రాంతంలోని ఇంట్లోనే ఉంటూ కుమార్తెలతో పాటు శిలంబం నేర్చుకుంటున్నారు. సత్యపాళయానికి చెందిన నవోపయ అనే వ్యక్తి వీరికి శిలంబం నేర్పిస్తున్నారు. సామాజిక దూరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన మీటరు దూరంలో నిలబడి శిక్షణ ఇస్తుండడం గమనార్హం. ఈ విషయాన్ని నటి దేవయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. షూటింగ్‌లు లేనందున ఇలా కొత్త విషయాలపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వయసులో తనకెందుకులే అని అనుకోకుండా కొత్త విషయంపై దృష్టిపెట్టడం గొప్ప విషయమని నెటిజన్లు అంటున్నారు.  
కళరి నేర్చుకుంటున్న కాజల్‌ 

శంకర్‌ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్‌హాసన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇండియన్‌ 2’ చిత్రంలో నటిస్తోంది కాజల్‌. ఇందులో ఆమె చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా చిత్రీకరణలు లేనందన ఖాళీగా చూర్చోవడం ఎందుకని, ఈ సినిమాలో కొన్ని పోరాట సన్నివేశాల కోసం కళరి విద్యను నేర్చుకుంటోంది. ఈ విషయంపై అమ్మడు స్పందిస్తూ.. కరోనా సమస్య పూర్తయిన తర్వాత మళ్లీ చిత్రీకరణ మొదలవుతుంది. నాకు సంబంధించిన పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తారు. అందుకే ఇప్పుడు ఈ సమయంలో కళరి నేర్చుకుంటున్నానని చెప్పింది. 
బయటకు వస్తున్న పికాసో!

లాక్‌డౌన్‌ సమయంలో తనలో ఉన్న పికాసో బయటకు వస్తున్నాడని నటి మహిమా నంబియార్‌ చెబుతోంది. తారల్లో ఉన్న ప్రత్యేకతలు ఈ సమయాల్లో ఒకొక్కటిగా బయటకు వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నటి మహిమా నంబియార్‌ స్పందిస్తూ ‘ప్రస్తుతం నేను కొన్ని చిత్రాలు గీస్తున్నా. నాలో ఉన్న పికాసోను ఈ లాక్‌డౌన్‌ బయటకు తెచ్చింది. మీలో కూడా ఓ మంచి కళాకారుడు ఉంటాడు. మీకు కావాల్సిందల్లా ఓ గోడ, పెన్సిల్‌.. అంతే! మీ ఇంట్లో అమ్మ అనుమతిస్తే.. గోడలపై బొమ్మలు గీసేయండి’ అని అంటోంది. అన్నట్లు ఈ అమ్మడు ఓ చిత్రకారిణి అనే విషయం ఇప్పుడే అందరికీ తెలుస్తోంది. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.