close
Array ( ) 1

తాజా వార్తలు

ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానుల ఎదురుచూపు

విక్రం

కోడంబాక్కం: గెలుపోటములతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రతి సినిమాలోనూ ప్రయోగం, వైవిధ్యాన్ని చూపుతన్న నటుడు విక్రం. ఆయా కథకు తగ్గట్లు శరీరాకృతి, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకునే ఆయన ప్రస్తుతం ‘కోబ్రా’ కోసం మరింత భిన్నంగా కనిపించనున్నారని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలోని ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తదితరులు నటించారు. 7 స్క్రీన్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో విక్రం 12 పాత్రల్లో నటిస్తుండటం విశేషం. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఇది విక్రంకు 58వ చిత్రం. షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ప్రేమికుల రోజున ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని చిత్రవర్గాలు భావించాయి. అయితే కొన్ని కారణాలతో వాయిదా పడింది. దీంతో ఈ నెల 28న సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. విక్రం అభిమానులు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.