close
Array ( ) 1

తాజా వార్తలు

ఒక గుజరాతీ అంటే 70మంది అమెరికన్లు:వర్మ

ట్రంప్‌-మోదీ సంభాషణపై సరదా ట్వీట్‌ 

హైదరాబాద్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొదటిసారి భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటన అనంతరం ట్రంప్‌ మంగళవారం అమెరికాకు తిరిగివెళ్లారు. అయితే ట్రంప్‌కు స్వాగతం పలుకుతూ అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్‌గోపాల్‌ వర్మ.. ట్రంప్‌ - మోదీ సంభాషణ గురించి ఓ సరదా ట్వీట్‌ పెట్టారు. ప్రస్తుతం ఆయన పెట్టిన ట్వీట్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ట్రంప్‌: మిస్టర్‌.మోదీ నన్ను చూడడానికి 70 లక్షల మంది వస్తారని నువ్వు చెప్పావు కానీ కేవలం లక్ష మంది మాత్రమే వచ్చారు.

మోదీ: మిస్టర్‌.ట్రంప్‌.. ఒక డాలర్‌ రూ.70తో సమానమైనట్లు.. ఒక గుజరాతీ 70మంది అమెరికన్స్‌తో సమానం.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.