close
Array ( ) 1

తాజా వార్తలు

మెప్పిస్తున్న కంగనా రనౌత్‌

‘తలైవి’లో కంగనా

కోడంబాక్కం, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి, పురట్చి తలైవి జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ నటిస్తోంది. ఎంజీఆర్‌ పాత్రను అరవింద్‌స్వామి పోషిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను విడుదల చేశారు. అయితే అందులో.. జయలలిత లాగా కంగనా రనౌత్‌ను చూపించడంలో చిత్ర బృందం పూర్తిగా విఫలమైందని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత ఎంజీఆర్‌ పాత్రకు సంబంధించి ఇటీవల అరవింద్‌స్వామి గెటప్‌ను విడుదల చేశారు. అచ్చం ఎంజీఆర్‌లాగే కనిపించడంతో ఈ చిత్రంలో ఆయనే మంచి పేరు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా షూటింగ్‌స్పాట్‌లో కూడా అరవింద్‌స్వామిని చూసి నిజంగానే ఎంజీఆర్‌ వచ్చినట్లుందని పలువురు కితాబిచ్చారట. ఇదిలా ఉండగా నిన్నటి వరకు కంగనాను జయలలిత పాత్రకు ఎంపిక చేయడంపైనే ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల నడుమ తాజాగా కంగనా రెండో గెటప్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. తొలి లుక్‌తో పోల్చితే ఇది కాస్త ఊరటనిస్తోంది. అన్నాడీఎంకే జెండా అంచుతో ఉన్న తెల్ల చీరలో ఈ పాత్రకు కొంత వరకు న్యాయం చేసినట్లు అనిపిస్తోంది.

పూర్ణ

శశికళగా.. పూర్ణ..!

భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో నటి పూర్ణ కూడా చేరినట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఆమె శశికళ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమాలో ప్రియమణి, ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఐరన్‌ లేడీ జయలలిత బయోపిక్‌లో తాను నటిస్తుండటం ఆనందంగా ఉందని నటి పూర్ణ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఏఎల్‌ విజయ్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఇది అద్భుతమైన అవకాశమని పేర్కొన్నారు. ఇక జానకి పాత్రలో మధుబాలా, ఆర్‌ఎం వీరప్పన్‌ పాత్రలో సముద్రఖని నటిస్తున్నారు. 90 శాతం వరకు చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.