close

తాజా వార్తలు

బాలా ‘వర్మ’ వస్తాడా?

‘వర్మ’

కోడంబాక్కం, న్యూస్‌టుడే: విక్రం కుమారుడు ధ్రువ్‌ ఇటీవల నటించిన రీమేక్‌ చిత్రం ‘ఆదిత్య వర్మ’. ధ్రువ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. విశ్లేషకుల మన్ననలు అందుకున్నారు. అయితే ఈ సినిమాకు ముందు బాలా దర్శకత్వంలో ‘వర్మ’ పేరిట తొలి రీమేక్‌ సిద్ధమైన విషయం తెలిసిందే. కొన్ని కారణాలతో దానిని పక్కనపెట్టి.. మళ్లీ కొత్తగా తెరకెక్కించి ‘ఆదిత్య వర్మ’గా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో బాలా ‘వర్మ’ చిత్రాన్ని ఆన్‌లైన్‌ వేదికపై విడుదల చేయడానికి చిత్రవర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. వాస్తవానికి ఈ సినిమా కోసం రూ.20 నుంచి రూ.28 కోట్ల వరకు ఖర్చు అయినట్లు కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఆ వెర్షన్‌ ద్వారా డిజిటల్‌ రైట్స్‌తో కొంత మొత్తాన్ని రాబట్టుకోవడానికి నిర్మాణ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ రైట్స్‌ కోసం ఓ సంస్థ రూ.5 కోట్ల వరకు అడిగినట్లు తెలుస్తోంది. అయితే విక్రం తరఫున అందుకు సమ్మతించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిర్మాత, విక్రం కలిసి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.