close

తాజా వార్తలు

బ్యాంకాక్‌లో మొదలైన మణిరత్నం చిత్రం

కోడంబాక్కం, న్యూస్‌టుడే: కల్కి విరచిత ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల పుస్తక ప్రియులతో పాటు సినీ జనాలకు బాగా ఇష్టం. ఈ నవల ఆధారంగా రూపొందే చిత్రంలో నటించాలని ఎంతో మంది హీరోలు అనుకున్నారు. అందులో ‘పురట్చి తలైవర్‌’ ఎంజీఆర్‌ కూడా ఒకరు. రజనీకాంత్‌తో పాటు పలువురు అగ్ర హీరోలకు ఈ నవల అంటే చాలా ఆసక్తి. ఎంతో మందికి కలల చిత్రంగా మిగిలిపోయిన ఈ సినిమాను మణిరత్నం తెరకెక్కిస్తుండటం విశేషం. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. విక్రం, కార్తి, జయంరవి, విక్రంప్రభు, రహమాన్, ఐశ్వర్యారాయ్, ఐశ్వర్యాలక్ష్మి, శరత్‌కుమార్, ప్రభు, జయరామ్, అశ్విన్, కిశోర్‌ వంటి పెద్ద తారాగణంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తొలుత కార్తి, జయంరవి, ఐశ్వర్యారాయ్‌ పేర్లు మాత్రమే వినిపించాయి. ఆ తర్వాత మిగిలినవారంతా చేరారు. రెండు నెలలకు పైగానే నిర్మాణ పూర్వ పనులు చేపట్టారు మణిరత్నం. ఈ నేపథ్యంలో బ్యాంకాక్‌లో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానరుపై సుభాస్కరన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిరత్నం సారథ్యంలోని మెడ్రాస్‌ టాకీస్‌ కూడా నిర్మిస్తోంది. కుమరవేల్‌తో కలిసి స్క్రీన్‌ప్లే సమకూర్చారు మణిరత్నం. మాటలు జయమోహన్‌ రాశారు. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. రవివర్మన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.