ఆయన జీవితం స్ఫూర్తిదాయకం: వెంకయ్య - doraswamy life is inspiring for many says vice president
close
Updated : 20/01/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయన జీవితం స్ఫూర్తిదాయకం: వెంకయ్య

దిల్లీ: ప్రముఖ నిర్మాత దొరస్వామిరాజు మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దొరస్వామి రాజు ఎన్నో గొప్ప సినిమాలు తీశారని గుర్తు చేశారు. నిర్మాతగా, రాజకీయ నేతగా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించారని కొనియాడారు.

‘‘ప్రముఖ నిర్మాత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ శాసనసభ్యులు వరదరాజు దొరస్వామి పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. పంపిణీదారుడిగా చిత్రపరిశ్రమలోకి ప్రవేశించి అంచెలంచెలుగా నిర్మాతగా ఎదిగిన ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. సినీ నిర్మాతగా విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రాలను నిర్మించిన దొరస్వామి గారి సినీ ప్రయాణం ఉన్నతమైనది.

సీతారామయ్యగారి మనవరాలు, మాధవయ్యగారి మనవడు, ప్రెసిడెంటుగారి పెళ్లాం వంటి కుటుంబ కథా చిత్రాలతో పాటు అన్నమయ్య, వెంగమాంబ వంటి భక్తిరస చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిర యశస్సును సంపాదించుకున్నారు. నగరి ఎమ్మెల్యేగా, తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యుడిగా దొరస్వామి అందించిన సేవలు అనుపమానమైనవి. తెలుగు సినిమా పరిశ్రమలో, రాజకీయ రంగంలో అజాతశత్రువుగా అందరి అభిమానాన్ని చూరొగొన్న దొరస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని వెంకయ్యనాయుడు తన ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు, దొరస్వామి మృతిపై తెలుగు చిత్రపరిశ్రమ నివాళులర్పించింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్‌, తమ్మారెడ్డి భరద్వాజ, నటుడు మురళీమోహన్‌ తదితరులు కదిలివచ్చారు. ఫిల్మ్‌నగర్‌ మహా ప్రస్థానంలో దొరస్వామిరాజు కుమారుడు విజయ్‌ కుమార్‌ వర్మ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఎన్నో సినిమాలకు నిర్మాతగా, పంపిణీదారుడిగా దొరస్వామి రాజు వ్యవహరించారు.

ఇదీ చదవండి...

అభిమానులకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బ్రేకింగ్‌ న్యూస్‌


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని