ఆసుపత్రిలో డాక్టర్ల ‘సీటీమార్‌’ స్టెప్పులు - doctors groove to salman khans seeti maar song
close
Published : 17/05/2021 00:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసుపత్రిలో డాక్టర్ల ‘సీటీమార్‌’ స్టెప్పులు


ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సెకండ్‌ వేవ్‌లో వైద్యులకు కనీసం విశ్రాంతి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. రోజంతా పీపీఈ కిట్లలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ఓ ఆసుపత్రిలో వైద్యులు మాత్రం దొరికిన కాస్త సమయాన్ని వినూత్నంగా ఆస్వాదించారు. సల్మాన్‌ఖాన్‌, దిశాపటాని జంటగా నటించిన ‘రాధే’ చిత్రంలోని ‘సీటీమార్‌’ పాటలకు స్టెప్పులేసి సందడి చేశారు. అంతేకాదు ఓ వైద్యుడు సంగీత విద్వాంసుడిగా మారి మాండొలిన్ వాయించాడు. మరికొంత మంది అందుకు తగ్గట్లుగా డ్యాన్స్‌ చేశారు. ఇప్పుడీ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను దిశాపటాని ఫ్యాన్స్‌ క్లబ్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘వైద్యులే మన రియల్‌ హీరోస్‌’ అంటూ పొగిడేస్తున్నారు. వారిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని