ప్రెస్మీట్లో అనుకోని ఘటన
హైదరాబాద్: పాటలు.. ప్రశంసలు.. స్పీచ్‌లతో ఎంతో జోష్‌ఫుల్‌గా సాగుతున్న ఓ సినిమా ప్రెస్మీట్లో అనుకోనివిధంగా జరిగిన ఘటన ప్రేక్షకులను షాక్‌కు గురయ్యేలా చేసింది. బుల్లితెర వ్యాఖ్యాతగా తన కామెడీ టైమింగ్, పంచులతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రదీప్ హీరోగా తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘30 రోజుల్లో ప్రేమిచడం ఎలా?’. లాక్డౌన్ కారణంగా గతేడాది విడుదలకు నోచుకోని ఈ సినిమా జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరికొన్ని రోజుల్లో తమ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ‘30 రోజుల్లో ప్రేమిచడం ఎలా?’ ప్రెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న దర్శకుడు మున్నా.. ముందు నుంచి తమ చిత్రానికి ఎంతో సపోర్ట్ చేస్తున్న మీడియాకు, సినీ పరిశ్రమలో తనకు అండగా నిలిచిన స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హీరో ప్రదీప్ మాట్లాడుతూ తమ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించిన అనూప్‌రూబెన్స్‌కు, ‘నీలినీలి ఆకాశం’ వంటి అద్భుతమైన పాటను అందించిన చంద్రబోస్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ క్రమంలోనే స్టేజ్‌పై హీరో వెనుక నిల్చొని ఉన్న దర్శకుడు మున్నా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్టేజ్‌పై ఉన్న ప్రదీప్, ఇతర చిత్రబృందం ఆయనకు మంచినీళ్లు అందించారు. అనంతరం స్టేజ్‌పై నుంచి దింపి ప్రథమ చికిత్స చేయించారు. పనిఒత్తిడి కారణంగానే మున్నా కళ్లు తిరిగి స్టేజ్‌పై పడిపోయినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి
స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరో, హీరోయిన్
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
-
కీర్తి కూడా వచ్చేస్తున్నారు..!
- ‘సలార్’ విడుదల తేదీ ఖరారు
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
- మోహన్‌బాబు సరసన మీనా!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!