close

తాజా వార్తలు

Published : 03/08/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముంబయి పోలీసులకు అక్షయ్‌ సాయం

ముంబయి: కరోనా సంక్షోభంలో సినీ ప్రముఖులు ఎంతో మంది తమవంతు సాయం చేసిన విషయం తెలిసిందే. ప్రధాని ప్రారంభించిన పీఎం కేర్‌ ఫండ్‌కు బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ అయితే ఏకంగా రూ. 25 కోట్లు విరాళం ఇచ్చాడు. ఆ తర్వాత ముంబయి కార్పొరేషన్‌కు రూ. 3 కోట్లు ప్రకటించాడు. అంతటితో అక్షయ్‌ ఆగలేదు. కరోనా కట్టడి కోసం అహర్నిశలు పనిచేస్తున్న ముంబయి పోలీసులకు రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చాడు. తాజాగా అదే ముంబయి పోలీసులకు అక్షయ్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లు అందజేశాడు. ఈ డివైజ్‌ ధరిస్తే ఆక్సిజన్‌, శరీర ఉష్ణోగ్రత, హర్ట్‌  రేట్‌ తెలిసిపోతుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో పోలీసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అక్షయ్‌ ఈ డివైజ్‌లను విరాళంగా ఇచ్చాడు. 

అక్షయ్‌ చేసిన సాయాన్ని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ ఆయన్ను ప్రశంసించారు. ముంబయి పోలీసులకన్నా ముందు నాసిక్‌ పోలీసులకు సైతం అక్షయ్‌ ఈ హెల్త్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లను అందజేశారని వెల్లడించారు.‘‘అక్షయ్‌ గారు ఎల్లప్పుడు సైన్యానికి, వివిధ రాష్ట్రాల్లోని పోలీసులకు ఎంతో మద్దతుగా ఉంటారు. కొవిడ్‌ వారియర్స్‌పై ఆయన చూపించిన శ్రద్ధకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ డివైజ్‌లను బీఎంసీ ఉద్యోగులకు ఇచ్చే విషయంపై కూడా చర్చించాం’’అని ఆదిత్య ఠాక్రే ట్వీట్‌లో పేర్కొన్నారు. గత నెలలో నటుడు సోనూ సూద్‌ కూడా ముంబయి పోలీసులకు 25వేల ఫేస్‌ షీల్డ్స్‌ విరాళంగా ఇచ్చాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.