సంపూర్ణేష్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం! - a small accident took place in the shooting of sampoorneshs bazarrowdy sets
close
Updated : 23/01/2021 15:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంపూర్ణేష్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం!

హైదరాబాద్‌: షూటింగ్‌లో ఓ ప్రమాదం నుంచి నటుడు సంపూర్ణేష్‌బాబు త్రుటిలో తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళితే సంపూర్ణేష్‌బాబు హీరోగా ‘బజారు రౌడీ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్రంలోని కొన్ని ఫైట్‌ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సంపూ బైక్‌తో పాటు గాల్లో ఉన్నట్టు ఒక షాట్‌ను తీస్తున్నారు. అందుకోసం బైక్‌ను తాడుతో కట్టి కిందకు వదిలే క్రమంలో అదుపుతప్పింది. దీంతో ఒక్కసారిగా ఆయన కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడికి చేరుకుని సంపూను పైకి లేపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడినట్టు సమాచారం.

ఈ చిత్రానికి వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తుండగా సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. మహేశ్వరి వద్ది కథానాయికగా ఆడిపాడుతోంది. సాయి కార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలో సందడి చేయనుంది.

ఇవీ చదవండి!

ఉపాసన షేర్‌ చేసిన ‘నాట్యం’ఫస్ట్‌లుక్‌!

స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరో, హీరోయిన్‌Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని