అవును, చాలా సంతోషంగా ఉంది: విద్యాబాలన్‌ - Vidya Balan shared her happines with fans about natkhat oscar nomination
close
Published : 08/11/2020 12:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవును, చాలా సంతోషంగా ఉంది: విద్యాబాలన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో మొదటిసారిగా నటించిన లఘుచిత్రం ‘నట్‌ఖట్‌’. ఈ చిత్రం ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్‌’కు నామినేట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో విద్యాబాలన్‌ తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘అవును, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను భాగమైన ‘నట్‌ఖట్‌’ 3వ భారతీయ లఘుచిత్ర పురస్కారాలు 2020లో ప్రథమస్థానంలో నిలిచింది. అంతేకాదు.. ఎంతో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుకు కూడా అర్హత సాధించింది. నేను ఎంతో గర్వపడుతున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే విడుదలైన ‘నట్‌ఖట్‌’ అభిమానుల ప్రశంసలు పొందింది. 2020 ఉత్తమ భారతీయ లఘుచిత్రాల్లో అగ్రస్థానంలో నిలవడంతో నేరుగా ఆస్కార్‌ పురస్కారానికి అర్హత సాధించింది.

ఈచిత్రంలో సోనూ అనే ఆకతాయి బాలుడికి తల్లిగా, గృహిణిగా విద్యాబాలన్‌ కనిపించింది. మహిళలను చిన్నచూపు చూసే మగవాళ్లతో తిరగడం, వాళ్లలాగే మారి స్త్రీలతో తప్పుగా ప్రవర్తించడం వంటివి చేస్తున్న కొడుకును మంచి మనిషిలా మార్చుకోవాలనే తల్లి పాత్రలో విద్యాబాలన్‌ నటించింది. పితృస్వామ్య పోకడలు, లింగ వివక్ష, గృహహింసకు వ్యతిరేకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. విద్యాబాలన్‌ ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించారు. షాన్‌ వ్యాస్‌ దర్శకుడు. అనుకంప హర్ష్, శ్యామ్ వ్యాస్ కథ అందించారు. సహ నిర్మాతగా రోనీ వ్యవహరించారు. అల్లకల్లోలం సృష్టించిన 2020లోనూ ఒక శుభవార్త వినడం చాలా సంతోషంగా ఉందని విద్యాబాలన్‌ చెప్పారు. ఈ సినిమాతో నేను నటిగానే కాకుండా తొలిసారిగా నిర్మాతగానూ వ్యవహించే అవకాశం వచ్చిందని ఆమె పేర్కొన్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని