close

తాజా వార్తలు

‘నారప్ప’లో ఊరమాస్‌గా వెంకీమామ

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ హీరోగా నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘అసురన్‌’ తెలుగు రీమేక్‌లో విక్టరీ వెంకటేశ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘నారప్ప’ టైటిల్‌ ప్రకటించారు. అంతేకాదు సినిమాలో వెంకీమామ లుక్స్‌ కూడా విడుదల చేశారు. ఆ లుక్‌లో వెంకటేశ్‌ ఊరమాస్‌గా కనిపిస్తున్నాడు. తొలుత సినిమాకు సంబంధించిన వివరాలు మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ అంతకంటే ముందుగానే సినిమా నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ తన ట్విటర్‌ ఖాతాలో విడుదల చేసింది. ఈ సినిమా టైటిల్‌తో పాటు వెంకటేశ్‌ లుక్స్‌ అదిరిపోయాయని అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్లు, ఇతర నటుల వివరాలు ప్రకటించాల్సి ఉంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.