close

తాజా వార్తలు

Updated : 23/01/2020 16:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఉప్పెన’లా వచ్చేసిన వైష్ణవ్‌ తేజ్‌

ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్‌

హైదరాబాద్‌: సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రీలుక్‌లో మత్స్యకారుడి గెటప్‌లో మాస్‌ లుక్‌తో కనిపించి వైష్ణవ్‌ సినీ ప్రియులను మెప్పించారు. అయితే తాజాగా గురువారం సాయంత్రం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో వైష్ణవ్‌ మాస్‌, లవర్‌బాయ్‌ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతోపాటు సుకుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.