close

తాజా వార్తలు

30 రోజుల్లో ప్రేమించటం ఎలా!

హైదరాబాద్‌: బుల్లితెరపై తనదైన మాటలు, పంచ్‌లతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్‌ ప్రదీప్‌ త్వరలోనే వెండితెరపై సందడి చేయనున్నాడు. ఇప్పటివరకూ చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన ఈ సారి పూర్తిస్థాయి నటుడిగా మారనున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘30రోజుల్లో ప్రేమించటం ఎలా’. అమృత అయ్యర్‌ కథానాయిక. మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నటుడు రానా విడుదల చేశారు.

‘బుల్లితెర నుంచి పెద్ద తెరపై అడుగు పెడుతున్న బ్రదర్‌ ప్రదీప్‌ మాచిరాజుకు నా శుభాకాంక్షలు. ఇదిగో మ్యూజికల్‌ పోస్టర్‌’ అని రానా ట్వీట్‌ చేశారు. ఎస్వీపీ పిక్సర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.