బాబాయ్‌...అబ్బాయ్‌... ‘రానా నాయుడు’ - Telugu News Venkatesh Rana To Star In Netflix Series Rana Naidu
close
Updated : 23/09/2021 07:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాబాయ్‌...అబ్బాయ్‌... ‘రానా నాయుడు’

గ్గుబాటి కథానాయకులు వెంకటేష్‌.. రానా కలిసి నటిస్తే చూడాలన్నది సినీప్రియుల కల. ఇప్పుడా కల ‘రానా నాయుడు’ రూపంలో నిజమవుతోంది. అయితే ఇది సినిమా కాదు.. నెట్‌ఫ్లిక్స్‌ కోసం చేస్తున్న వెబ్‌సిరీస్‌. వెంకీ, రానా కలిసి నటించనున్న ఈ సిరీస్‌ను దర్శకులు కరన్‌ అన్షుమన్‌, సుపర్న్‌ వర్మ తెరకెక్కించనున్నారు. లోకో మోటివ్‌ గ్లోబర్‌ ఇంక్‌ సంస్థ నిర్మిస్తోంది. అమెరికన్‌ క్రైమ్‌ యాక్షన్‌ డ్రామా ‘రాయ్‌ డోనోవన్‌’ షో స్ఫూర్తితో.. ఈ సిరీస్‌ రూపొందించనున్నారు. దీని గురించి వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘రానాతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మా ఇద్దరికి సరైన కథ ఇది. ఇక మేము కలిసి తప్పకుండా వినోదం పంచుతాం. నేను ‘రాయ్‌ డోనోవన్‌’కు వీరాభిమానినే. ఆ ప్రాజెక్ట్‌కు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా’’ అన్నారు. ‘‘ఇది నాకెంతో ప్రత్యేకం. నా చిన్నాన్నతో కలిసి తొలిసారి నటించడం ఆనందంగా ఉంది. ఇది సవాల్‌తో కూడుకున్నదే అయినా.. ఎంతో సరదాగా ఉండనుందన్న నమ్మకం ఉంద’’న్నారు రానా.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని