‘అఖండ’ గర్జన - Telugu News Is this Akhanda Will Release On Dasara
close
Updated : 02/09/2021 07:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అఖండ’ గర్జన

థానాయకుడు బాలకృష్ణ.. దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘అఖండ’. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ స్వరాలందిస్తున్నారు. ఇప్పటికే ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. బాలకృష్ణ బుధవారం నుంచి తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించారు. దసరా లక్ష్యంగా ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో తొలి పాట విడుదల చేసి.. ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. పవర్‌పుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో సందడి చేయనున్నారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ లాంటి విజయవంతమైన చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కలయిక నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని