నవ్వుల సంరంభం తిరిగి ఆరంభం - Telugu News F3 Shoot Resume
close
Updated : 18/09/2021 10:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నవ్వుల సంరంభం తిరిగి ఆరంభం

‘ఎఫ్‌2’ అంటూ వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ · రెండింతల వినోదం పంచారు. ‘ఎఫ్‌3’ అంటూ ఈసారి నవ్వుల మోతాదుని మరింతగా పెంచనున్నారు. ‘ఎఫ్‌2’కి కొనసాగింపుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌3’ తెరకెక్కుతోంది. శిరీష్‌ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. తొలి సినిమా తరహాలోనే వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్‌ సరసన మెహ్రీన్‌ నటిస్తున్నారు. సునీల్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రధాన తారాగణమంతా చిత్రీకరణలో పాల్గొంటోంది. ‘‘అంచనాలకి తగ్గట్టుగా ఆసాంతం నవ్వుల జల్లుని కురిపించేలా అనిల్‌ రావిపూడి స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. వెంకీ, వరుణ్‌ల కోసం ప్రత్యేకమైన మేనరిజమ్స్‌, హావభావాల్ని సృష్టించారు. అవి మరింత నవ్విస్తాయి. పేరుకి తగ్గట్టే మూడింతల వినోదంతో నవ్వుల సంరంభంలా ఉంటుందీ చిత్రం. దేవిశ్రీప్రసాద్‌ ప్రత్యేకమైన ట్యూన్లని సిద్ధం చేశారు.  శరవేగంగా చిత్రీకరణని పూర్తి చేసేలా ప్రణాళిక రచించాం’’ అని సినీ వర్గాలు తెలిపాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని