అఖండ పోరాటం - Telugu News Akhanda climax Fight Sequence Shot Completed
close
Updated : 12/08/2021 07:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అఖండ పోరాటం

బాలకృష్ణ ఒంటరిగా బరిలో దిగాడంటేనే వ్యవహారం దబిడి దిబిడి అవుతుంది. ఇక ఇద్దరు బాలయ్యలు కలిసి చేతులు కలిపారంటే ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘అఖండ’ సినిమా పతాక సన్నివేశాలు ఇటీవల తమిళనాడులో తెరకెక్కించారు. బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు బాలకృష్ణలు కలిసి కనిపించే పతాక సన్నివేశాల్ని, ఆయనతో పాటు ప్రధాన తారాగణంపై తమిళనాడులోని ఓ దేవాలయం నేపథ్యంలో తెరకెక్కించారు. త్వరలోనే మొదలు కానున్న చివరి షెడ్యూల్‌తో చిత్రం పూర్తవుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ నటిస్తున్నారు. శ్రీకాంత్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. తమన్‌ స్వరకర్త. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని