‘అఖండ’ ఆటాపాట - Telugu News Akhanda Shooting in Progress
close
Updated : 22/09/2021 08:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అఖండ’ ఆటాపాట

దసరా బరిలో నిలిచేందుకు సెట్స్‌పై శర వేగంగా ముస్తాబవుతోంది ‘అఖండ’. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మాత. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. ఇప్పటికే టాకీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు మిగిలిన పాట చిత్రీకరణకు సిద్ధమైంది. మంగళవారం నుంచి గోవాలో ఈ పాట చిత్రీకరణ ప్రారంభమైంది. వారం పాటు షూట్‌ ఇక్కడే కొనసాగనుందని, ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. విభిన్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో సందడి చేయనున్నారు. పూర్ణ, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని