Akhanda: ‘అఖండ’.. గర్జనకు సిద్ధం - Telugu News Akhanda Shooting Completed
close
Updated : 06/10/2021 07:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Akhanda: ‘అఖండ’.. గర్జనకు సిద్ధం

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా ‘అఖండ’. ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి విజయాల తర్వాత ఈ ఇద్దరి కలయిక నుంచి వస్తున్న మూడో చిత్రమిది. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర బృందం మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా సెట్లో బాలకృష్ణ, బోయపాటి, నిర్మాత రవీందర్‌ కలిసి ఉన్న ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.    ‘‘మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో అఘోరాగా కనిపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్‌.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని