అడిగా... జతగా - Telugu News Adiga Adiga Song Out From Akhanda
close
Updated : 19/09/2021 07:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అడిగా... జతగా

బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. అందులో భాగంగా తొలి పాటని శనివారం విడుదల చేశారు. ‘అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా... జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా...’ అంటూ సాగే ఆ పాటని తమన్‌ స్వరకల్పనలో ఎస్పీ చరణ్‌, ఎం.ఎల్‌.శ్రుతి ఆలపించారు. కల్యాణ్‌ చక్రవర్తి సాహిత్యం సమకూర్చారు. ‘‘బాలకృష్ణ, ప్రగ్యా జోడీ తెరపై మేజిక్‌ చేయనున్నట్టు స్పష్టమవుతోంది. బోయపాటి శ్రీను సినిమాల్లో మంచి మెలోడీలు ఉంటాయి. అందులో ఈ పాటా చేరుతుంద’’న్నాయి సినీ వర్గాలు. పూర్ణ, జగపతిబాబు, శ్రీకాంత్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ  చిత్రానికి ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని