నేను ఎవరితోనూ ప్రేమలో లేను: శ్రీముఖి
close
Updated : 27/02/2020 15:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను ఎవరితోనూ ప్రేమలో లేను: శ్రీముఖి

ఏదో కొన్ని వీడియోలు చేస్తే అలా అనుకుంటారా..! 

హైదరాబాద్‌: ప్రస్తుతం తాను ఎవరితోనూ ప్రేమలోలేనని.. ప్రతిరోజూ షూటింగ్స్‌లో బిజీగా ఉంటున్నానని యాంకర్‌ శ్రీముఖి అన్నారు. ఇటీవల ఇన్‌స్టా వేదికగా జరిగిన సరదా సంభాషణలో మాట్లాడుతూ తాను ఒకప్పడు ప్రేమలో ఉన్నానని ఆంగ్లంలో సమాధానం ఇచ్చానన్నారు. దీంతో ఆమె చెప్పిన సమాధానాన్ని తప్పుగా అర్థం చేసుకున్న పలు వెబ్‌సైట్ల వారు..శ్రీముఖి ప్రేమలో పడిదంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా తన గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. తాను ప్రస్తుతానికి ఎవరితోనూ ప్రేమలోలేనని చెప్పారు.

‘హాయ్‌ ఆల్‌.. ఒక విషయం చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. Been in Love అంటే ఒకప్పుడు నేను లవ్‌లో ఉన్నాను. I Am In Love అంటే ఇప్పుడు నేను లవ్‌లో ఉన్నాను అని అర్థం. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ‘Truth or Dare’ లాంటి గేమ్‌ ఆడి కొన్ని వీడియోలు చేసినందుకు దాని గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అవి చూసిన నా స్నేహితులు నిజంగానేనా? అంటూ అడుగుతున్నారు. రాసేవాళ్లకి న్యూస్‌ అవసరం ఉందని నాకు బాగా తెలుసు. కాబట్టి ఇలాంటి వార్తలు రాసేవాళ్లు కొంచెం చూసుకుని, పూర్తి విషయం తెలుసుకుని రాస్తే అందరికీ బాగుంటుంది. నేను ప్రతిరోజూ షూటింగ్స్‌లో బిజీగా ఉంటున్నాను. ప్రస్తుతానికి లవ్‌ అఫైర్స్‌ లాంటివి లేవు. నా వ్యక్తిగత జీవితం గురించి నా కంటే బాగా మీకే తెలుసు. ఒకవేళ నేను నిజంగానే లవ్‌లో పడితే.. నాకంటూ ఒక బాయ్‌ఫ్రెండ్‌ ఉంటే.. అతనితో ఒక వీడియో చేసి ‘ఫైనల్‌గా నేను ప్రేమలో పడ్డాను’ అని మీ అందరికీ చెబుతాను. కాబట్టి కొంచెం చూసుకోండి.’ అని శ్రీముఖి పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని