close

తాజా వార్తలు

బాలయ్య సరసన బాలీవుడ్‌ భామ..?

హైదరాబాద్‌: ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ మాస్‌ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను, టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు బాలకృష్ణ. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించబోయే నటీనటులకు సంబంధించి పలు రూమర్స్‌ వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆమెతో చర్చలు జరుగుతున్నాయట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌, రోజా పేర్లు వినిపించినప్పటికీ దీనిపై ఎటువంటి స్పష్టత రాలేదు. ఈ క్రమంలో తాజాగా బాలకృష్ణ సినిమాలో శ్రీకాంత్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.