కొందరు క్రూరులు వదిలేస్తున్నారు: ఉపాసన
close
Published : 02/04/2020 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొందరు క్రూరులు వదిలేస్తున్నారు: ఉపాసన

మీ ప్రేమను ఇప్పుడే చూపించాలి..

హైదరాబాద్‌: హృదయం లేని కొందరు వ్యక్తులు తమ పెంపుడు జంతువుల్ని వదిలేస్తున్నారని కొణిదెల కోడలు ఉపాసన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ఆమె స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అయితే తన పెంపుడు గుర్రం డైసీకి మాత్రం ఇది వర్తించదంటూ దానిపై ప్రేమను సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ‘నా డార్లింగ్‌ డైసీ విషయంలో స్వీయ నిర్బంధం వర్తించదు. మీరు వాటిని ఎంత ప్రేమిస్తున్నారో, ఎంతగా సంరక్షించాలి అనుకుంటున్నారో మూగజీవాలకు తెలియజేయాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో కొంతమంది క్రూరులు పెంపుడు జంతువుల్ని వదిలేస్తున్నారు. మీరు మూగజీవుల్ని చూసే విధానం మీ వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది’ అని ఆమె పోస్ట్‌ చేశారు. నిజమేనంటూ కొంత మంది జంతు ప్రేమికులు ఉపాసనకు బదులిచ్చారు.

రామ్‌ చరణ్‌కు పెంపుడు జంతువులంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన షూటింగ్‌ లేనప్పుడు, వీకెండ్స్‌లో ఇంట్లో ఉన్న గుర్రాలు, శునకాలు, కోళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. ఇలా వివిధ సందర్భంగా తీసిన ఫొటోల్ని ఉపాసన పలుమార్లు సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు. అంతేకాదు వీరు మూగజీవులకు ముద్దుగా పేర్లు కూడా పెట్టుకున్నారు.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని