close

తాజా వార్తలు

Published : 01/12/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫిట్‌గా మారి.. లగ్జరీకారు గిఫ్ట్‌గా పొంది

చెన్నై: శరీరాకృతిని మార్చుకునే క్రమంలో ఫిట్‌గా మారి.. లగ్జరీ కారును బహుమతిగా అందుకున్నారు నటుడు శింబు. సాధారణంగా కొంచెం బొద్దుగా కనిపించే ఈ హీరో..  లాక్‌డౌన్‌ సమయంలో షూటింగ్స్‌ లేకపోవడంతో శరీరాకృతిపై దృష్టి పెట్టారు. ట్రైనర్‌ సాయంతో జిమ్‌లో వర్కౌట్లు, డ్యాన్స్, యోగా.. ఇలా ఎన్నో విధాలుగా శ్రమించి సన్నబడ్డారు. ఇటీవల తన ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌కు సంబంధించిన ఓ ప్రత్యేకమైన వీడియోని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. శింబు లుక్‌ చూసి అభిమానులు సైతం ఫిదా అయ్యారు.

శింబు కథానాయకుడిగా నటిస్తున్న ‘ఈశ్వరన్‌’ సినిమా కోసమే ఆయన సన్నబడినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ‘ఈశ్వరన్‌’ తర్వాత వచ్చే ‘మానాడు’ చిత్రంలో కూడా ఆయన ఇదే లుక్‌లో కనిపించనున్నారట. అయితే, వృత్తిపట్ల, ఫిట్‌నెస్‌ విషయంలో శింబు చూపించిన చొరవకి ఆయన తల్లి ఉషా మురిసిపోయారు. మినీ కూపర్‌(MINI COOPER) బ్రిటిష్‌ రేసింగ్‌ కారును శింబుకు బహుమతిగా ఇచ్చి.. ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కారు ధర దాదాపు రూ. 50లక్షలు ఉండొచ్చని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.


Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని