close

తాజా వార్తలు

మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్పంటూ..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌ ఫ్యాన్స్‌ వార్‌పై సిద్ధార్థ్‌ మండిపాటు

చెన్నై: మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్పంటూ అభిమానుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సోషల్‌మీడియా వల్ల ఈ వివాదాలు కాస్త తారస్థాయికి చేరుతున్నారు. ఇష్టమైన హీరో సినిమాల్ని, అతడి విజయాల్ని ట్రెండింగ్‌ చేయడానికి అభిమానులు ఉత్సాహం చూపడం సహజం. కానీ ఇతర హీరోతో పోలుస్తూ.. విమర్శించడం సరికాదు. ప్రస్తుతం తమిళ అభిమానులు, తెలుగు అభిమానులకు మధ్య సోషల్‌మీడియాలో వార్‌ జరుగుతోంది. #UnrivalledTamilActors,  #teluguRealHeroes ట్యాగ్‌లను ట్రెండ్‌ చేయాలంటూ ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నారు. ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకుంటున్నారు. దీంతో ఈ రెండు ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి.

వీటిని చూసిన కథానాయకుడు సిద్ధార్థ అసహనం వ్యక్తం చేశారు. ‘ఇవాళ సోషల్‌మీడియాలో పైత్యం ఛాలెంజ్‌ ఏంటో తెలుసా.. దక్షిణాది అభిమానుల మధ్య పోటీ. #UnrivalledTamilActors vs #TeluguRealHeroes.. ఎవరి ఫ్యాన్స్‌ వారి ట్యాగ్‌లను ట్రెండ్‌ చేయడం. ఇంటర్నెట్‌ను విపరీతంగా వృథా చేస్తున్నారు. ఈ యువత ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుని తమ జీవితాల్ని బాగు చేసుకోవడానికి కృషి చేస్తే దేశం ఎంతో బాగుంటుంది’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.