
తాజా వార్తలు
సుశాంత్ పంపిన ఆఖరి మెసేజ్ అదే..
భావోద్వేగానికి గురైన సుశాంత్ స్నేహితుడు
హైదరాబాద్: బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణించి ఐదు నెలలు దాటింది. ఇప్పటికీ ఆయన అభిమానులు ఆ చేదు నిజాన్ని నమ్మలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉన్న సుశాంత్ మిత్రుడు సిద్ధార్థ్ తాజాగా స్పందించాడు. సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ స్నేహితుడు సిద్ధార్థ్గుప్తా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సుశాంత్ మృతికి ఐదు రోజుల ముందు ఒకసారి కలుద్దామని సంక్షిప్త సందేశాలు పంపించుకున్నామన్నారు.
‘మనమింకా పరిపూర్ణత సాధించాలని సుశాంత్ అంటుంటేవాడు. ప్రతి రోజూ కొత్తదనం కోరుకునేవాడు. ఏదో సాధించాలని చెబుతుండేవాడు. అతని వల్లే నేను కూడా కొత్తగా ఆలోచించడం, కొత్త లక్ష్యాలను ఏర్పరుచుకోవడం నేర్చుకున్నా. తన చుట్టుపక్కల వాళ్లను ఎంతో ప్రేమిస్తాడు. ఒక స్నేహితుడిగా నాకు ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు. అతనికి సహచరుడిగా ఉండటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను’ అని సిద్ధార్థ్ అన్నాడు.
ఇక వాళ్ల మధ్య జరిగిన ఆఖరి సంభాషణ గురించి మాట్లాడుతూ.. ‘‘నిన్ను, కుశల్ ఝవేరీ(సుశాంత్ మరో స్నేహితుడు) ఇద్దర్నీ కలవాలని అనిపిస్తోంది. మనం కలిసి తిరిగిన పాత రోజులు ఎంత బాగుండేవి..! కుశల్‌కు కూడా నా ప్రేమను వ్యక్తపరిచినట్లు తెలియజేస్తావు కదూ..!’ అని సుశాంత్ మెసేజ్ పంపించాడు. ఈ సందేశం వచ్చిన వెంటనే నేను కుశల్‌తో మాట్లాడాను. ‘సుశాంత్ సాధారణంగా ఇలాంటి సందేశాలు పంపించడు. కానీ.. కచ్చితంగా అక్కడ ఏదో జరుగుతోంది’ అని అతనితో చెప్పాను. ఆ వెంటనే.. ‘త్వరలోనే కులుసుకుందాం’ అని సుశాంత్‌కు కుశల్ రిప్లై ఇచ్చాడు. కానీ జరిగేదాన్ని మనం మార్చలేం’ అని సిద్ధార్థ్ చెప్పాడు. మిత్రుడి జ్ఞాపకాలు తలచుకొని ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు.
ఇదీ చదవండి..
‘సుశాంత్ నా చపాతీలు దొంగిలించేవాడు!
నటిపై గుర్రుగా ఉన్న సుశాంత్ ఫ్యాన్స్
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- ముక్క కొరకలేరు!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
