సుశాంత్‌ లాగే మీరూ జరుపుకోవాలి - Shweta Singh Kirti Urges Sushant Singh Rajput Fans to Celebrate Like Her Brother
close
Updated : 15/11/2020 07:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌ లాగే మీరూ జరుపుకోవాలి

అభిమానులను కోరిన నటుడి సోదరి

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన సోదరుడు సుశాంత్‌సింగ్‌ మాదిరే మీరు కూడా ప్రేమను పంచుతూ అందరి హృదయాల్లో నిలవాలని సుశాంత్‌ సోదరి శ్వేతాసింగ్‌ కీర్తి నటుడి అభిమానులను కోరారు. దిపావళి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. ‘అందరికి ప్రేమను పంచుదాం. వారి హృదయాల్లో నమ్మకాన్ని పెంచుదాం. సుశాంత్‌లాగే ఈ పండగను జరుపుకొందాం’ అని ట్విటర్‌ ద్వారా కోరారు. సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్న తన సోదరుడి ఫొటోను ఈ సందర్భంగా పంచుకున్నారు. ‘సుశాంత్‌ ప్రతిఒక్కరికి ప్రేమను పంచేందుకు ఇష్టపడేవాడు. అతడు చేసినట్లే దివాళి పర్వదినాన కొన్ని మంచి పనులు చేద్దాం. దీపాలు, క్యాండిళ్లను చిరు దుకాణదారుల వద్దే కొనుక్కుందాం. ఇలా చేస్తే వారు కూడా ఈ పండగను సంతోషంగా జరుపుకొంటారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొని మానవత్వం బతికుండేలా చూద్దాం’ అంటూ నటుడి ఫొటో పక్కన రాసుకొచ్చారు.

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా ఈ కేసును ముంబయి పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రస్తుతం ఈ కేసును మూడు దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. సీబీఐ విచారణలో మాదకద్రవ్యాల వినియోగం బయటపడటంతో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగింది. ఇప్పటికే పలువురిని విచారించింది. మరికొందరిని అరెస్టు చేసింది. సుశాంత్‌ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు బదిలీ చేసుకున్నారు అని వచ్చిన ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు జరుపుతోంది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని