close
Published : 07/07/2020 19:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సుశాంత్‌ ఆత్మహత్య కేసు: భన్సాలీ విచారణ

ముంబయి: ‘సుశాంత్ సింగ్‌ రాజ్‌పూత్‌ బిజీగా ఉండటం వల్లే నా సినిమాల్లో అవకాశం రాలేదు’ అని బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ పోలీసులకు చెప్పిన సమాధానం. సుశాంత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి అధికారులు ఇప్పటికే పలువురిని విచారించారు. నిన్న (సోమవారం) సంజయ్ లీలా భన్సాలీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. 2013లో భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘రామ్‌లీలా’ సినిమా కోసం చిత్రబృందం తొలుత సుశాంత్‌ను కలిసింది. అయితే ఆ తర్వాత వివిధ కారణాల వల్ల రణ్‌వీర్‌ సింగ్‌ను తీసుకున్నారు.  

తన సినిమాల నుంచి సుశాంత్‌ను తప్పించడంపై వస్తున్న ఆరోపణలను సంజయ్ లీలా భన్సాలీ ఖండించారని ఓ అధికారి తెలిపారు. తన సినిమా కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలని సుశాంత్‌ను కోరానని.. అయితే అప్పుడు బాగా బిజీగా ఉండటం వల్ల సుశాంత్‌ ఆఫర్‌ను వదులుకున్నాడని భన్సాలీ చెప్పినట్లు ఆ అధికారి పేర్కొన్నాడు. తర్వాత మరోసారి సుశాంత్‌‌ను సినిమా గురించి అడగలేదని.. అలా సుశాంత్‌కు అవకాశాన్ని ఇవ్వలేకపోయినట్లు భన్సాలీ చెప్పుకొచ్చినట్లు సమాచారం. సుశాంత్‌‌ ఆత్మహత్య కేసులో భన్సాలీని దాదాపు రెండు గంటలకుపైగా పోలీసులు విచారించారు. సినిమాలు, ఇతర విషయాలకు సంబంధించి 20 ప్రశ్నలను భన్సాలీకి సంధించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని