ఈ జోడీ స్టేజీ ఎక్కితే కోట్లలో వ్యూస్‌..! - Roja Shekhar master Dance Performances
close
Published : 16/11/2020 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ జోడీ స్టేజీ ఎక్కితే కోట్లలో వ్యూస్‌..!

రోజా-శేఖర్‌ మాస్టర్‌ డ్యాన్స్‌కి ప్రేక్షకులు ఫిదా

ఇంటర్నెట్‌డెస్క్‌: రోజా-శేఖర్‌ మాస్టర్‌.. వీరిద్దరూ స్టేజ్‌పై కనిపించారంటే ప్రేక్షకులకు వచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌ అంతా ఇంతా కాదు. నూతన సంవత్సరం, సంక్రాంతి, ఉగాది, విజయదశమి, దీపావళి.. ఇలా పండగ ఏదైనా సరే ఈవెంట్‌లో వీరి డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ ఉండాల్సిందే. శేఖర్‌ మాస్టర్‌తో కలిసి రోజా వేసే స్టెప్పులు చూసేందుకు చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఆసక్తి కనబరుస్తుంటారు. అందుకే వీరిద్దరి డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌లకు య్యూటూబ్‌లో సైతం ఆదరణ మెండుగా ఉంది.

2015 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మొదటిసారి రోజా-శేఖర్‌ కలిసి ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ జూనియర్స్‌’ స్టేజ్‌పై ‘రాజశేఖరా.. ఆగలేనురా’ పాట‌కి కాలు కదిపారు. అలా ఈటీవీలో ప్రసారమైన ఎన్నో ప్రత్యేక ఈవెంట్లలో వీరిద్దరూ.. డ్యాన్స్‌ చేసి మెప్పించారు. వీరి డ్యాన్స్‌ వీడియోలకు కోట్లలో వ్యూస్‌ ఉంటాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈటీవీలో ప్రసారమైన ‘శ్రీ కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా’ ఈవెంట్‌లో రోజా-శేఖర్‌.. ‘ఉట్టి మీద కూడు.. ఉప్పుచేప తోడు’ అంటూ మరోసారి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్‌ మాస్టర్‌-రోజా కలిసి చేసిన పలు డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌లను మీరు ఓ సారి చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని