గోవాకు పయనమైన ‘క్రాక్‌’ టీమ్‌  - Ravi Teja Krack team off to Goa for Final schedule
close
Published : 03/12/2020 19:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గోవాకు పయనమైన ‘క్రాక్‌’ టీమ్‌ 

హైదరాబాద్‌: మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్‌’టీమ్‌ గోవాకు పయనమైంది. ఫైనల్‌ షెడ్యూల్‌లో భాగంగా హీరో రవితేజ, హీరోయిన్‌ శృతీహసన్‌ మధ్య సముద్ర తీరంలో ఓ పాట చిత్రీకరించనున్నరట. ఈ పాటతో దాదాపు సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తికానుంది. ఈ చిత్రానికి గోపీచంద్‌మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రబృందం ఇప్పటికే  ఓ మాస్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ‘భూమ్‌ బద్దలు.. భూమ్‌ బద్దలు‌.. నా ముద్దుల సౌండు’ అంటూ సాగే ఈ పాట అది అభిమానులను బాగానే ఆకట్టుకుంది.

రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘డాన్‌ శీను’, ‘బలుపు’ సినిమాలు అభిమానుల నుంచి మంచి మార్కులు కొట్టేశాయి. వీరిద్దరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్‌ సినిమా కావడంతో ‘క్రాక్‌’పై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, సముద్రఖని కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు తమన్‌ బాణీలు అందిస్తున్నారు. 2021లో సంక్రాంతి కానుకగా ‘క్రాక్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. 

ఇదిలా ఉండగా.. ఈ సినిమా తర్వాత రవితేజ కోసం మరో సినిమా సిద్ధంగా ఉంది. ‘క్రాక్‌’ చిత్రీకరణ ముగియగానే ఆయన ‘ఖిలాడి’ సెట్లో కాలుపెట్టనున్నారు. దానికి రమేశ్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా చిత్రబృందం ఇప్పటికే విడుదల చేసింది. దానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిచనున్నారు.

ఇదీ చదవండి..

మాస్‌ మహారాజ్‌.. మాస్‌ బీట్‌ వచ్చేసింది!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని