లండన్‌లో లాక్‌డౌన్‌.. చిక్కుకుపోయిన ప్రియాంక - Priyanka Chopra strucked in UK due to lockdown
close
Published : 24/12/2020 16:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లండన్‌లో లాక్‌డౌన్‌.. చిక్కుకుపోయిన ప్రియాంక

లండన్‌: బాలీవుడ్‌ అగ్రనటి ప్రియాంక చోప్రా లండన్‌లో చిక్కుకుపోయారు. ఆమె ఇటీవల ఓ హాలీవుడ్‌ సినిమా చిత్రీకరణ కోసం యూకే వెళ్లింది. ఇదిలా ఉండగా.. కరోనా వ్యాప్తి ఎక్కువ అవడంతో అక్కడి ప్రభుత్వం నాల్గవ దశ లాక్‌డౌన్‌ను విధించింది. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్‌ నుంచి విదేశాలకు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రియాంక అక్కడే ఉండిపోయిందని తెలుస్తోంది. మరికొంత కాలం ఆమె అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ప్రియాంక చేయాల్సిన తర్వాతి సినిమాల షెడ్యుల్‌పై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం ప్రియాంక చోప్రా ‘టెక్ట్స్‌ ఫర్‌ యూ’ అనే హాలీవుడ్‌ సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలోనే లండన్‌ చేరుకున్న ఆమె నవంబర్ 29 నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. లాక్‌డౌన్‌లో ఇరుక్కుపోయిన చిత్రబృందం తాము అమెరికా వెళ్లేందుకు అనుమతించాలని అధికారులను కోరినట్లు సమాచారం. అయితే.. అక్కడ గతంలో కంటే నిబంధనలు కఠినంగా మారిన నేపథ్యంలో మరికొంతకాలం అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమెతో పాటు మరో బాలీవుడ్‌ నటుడు అఫ్తాబ్‌ శివదాసని కూడా అక్కడే ఉండిపోయాడు. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంకకు జోడీగా హాలీవుడ్‌ నటుడు సామ్‌ హ్యూగన్‌ కనిపించనున్నాడు. జిమ్ స్ట్రౌస్ డైరెక్టర్‌. 2016లో వచ్చిన జర్మన్‌ చిత్రం ‘SMS fr Dich’కు ఇంగ్లీష్‌ రీమేక్‌గా వస్తోన్న చిత్రమిది.

ఇదీ చదవండి..

రామ్‌ ‘రెడ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని