close

తాజా వార్తలు

Published : 01/12/2020 23:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కంగన గురించి చర్చలు అనవసరం: ఊర్మిళ

ముంబయి: కంగన రనౌత్‌ గురించి మరీ ఇంతగా చర్చించుకోవాల్సిన అవసరం లేదని సినీ నటి, శివసేన నాయకురాలు ఊర్మిళ  పేర్కొన్నారు. ఆమె తాజాగా శివసేనలో చేరిన సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గతంలో ఆమెను ‘సాఫ్ట్‌ పోర్న్‌ స్టార్‌’ అంటూ కంగన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయి చేరుకుంది. ఈ క్రమంలో తాజాగా ఊర్మిళను కంగన గురించి ప్రశ్నించగా ఆమె ఇలా స్పందించారు.

‘‘ఇప్పటికే కంగనా గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నట్లు నేను భావిస్తున్నా. నిజానికి ఇప్పుడు ఆమెకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ విమర్శించే హక్కు, స్వేచ్ఛ ఉంది. ఆమె కూడా అందులో భాగమే. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కంగన గురించి అడిగినప్పుడు నేను స్పందించలేదు. ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నా. అన్నింటికంటే ముఖ్యంగా నేను కంగనకు ‘అభిమాని’ని కాదు’’ అని ఆమె స్పష్టం చేశారు.

మహారాష్ట్ర శాసనమండలిలో గవర్నర్‌ నామినేట్ చేసిన 12 స్థానాల్లో ఊర్మిళ పేరు కూడా ఉన్నట్లు సమాచారం. 2019లో ఆమె కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. ఏడాది క్రితం కాంగ్రెస్‌ను వీడిన ఆమె తాజాగా శివసేనలో చేరారు. హిందుత్వ పార్టీగా పేరున్న శివసేనలో చేరడాన్ని ఆమె సమర్థించుకున్నారు. హిందుత్వం అంటే ఇతర మతాలను ద్వేషించడం కాదని ఆమె పేర్కొన్నారు.


Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని