‘నారప్ప’ టీజర్‌.. వచ్చిందప్ప..! - Narappa film teaser released
close
Published : 13/12/2020 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నారప్ప’ టీజర్‌.. వచ్చిందప్ప..!

ఇది వెంకీ పుట్టినరోజు కానుక

హైదరాబాద్‌: విక్టరీ వెంకటేశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులకు కానుకగా ‘నారప్ప’ చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఆయన ప్రధాన పాత్రలో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న సినిమా ఇది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్‌ కథానాయకుడిగా తమిళంలో విజయం సాధించిన ‘అసురన్‌’కు తెలుగు రీమేక్‌. వెంకీ సతీమణిగా ప్రియమణి నటిస్తున్నారు. మణిశర్మ బాణీలు అందిస్తున్నారు. ఆదివారం వెంకటేశ్‌ జన్మదినం సందర్భంగా ఆయనకు ముందస్తుగా శుభాకాంక్షలు చెబుతూ శనివారం సాయంత్రం ‘నారప్ప’ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఇందులో వెంకీ రౌద్రం పలికించిన తీరు అభిమానుల్ని ఆకట్టుకుంది. ఆయన కట్టు, బొట్టు, గెటప్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి.

ఈ ఏడాది జనవరిలో ‘నారప్ప’ చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 మహమ్మారి విస్తరిస్తోన్న తరుణంలో సినిమా షూటింగ్‌ను కొంత కాలంపాటు వాయిదా వేశారు. కొన్ని వారాల క్రితం తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టారు. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌, రాజీవ్‌ కనకాల, సంపత్‌ రాజ్‌, మురళీ శర్మ, కార్తిక్‌ రత్నన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇవీ చదవండి..
ఇప్పుడు సినిమాను ప్రేక్షక దేవుళ్లే బతికించాలి
నాని లైఫ్‌లో గుర్తుండిపోయే రోజు ఇది..!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని