ముంబయిలో పవర్‌కట్‌.. సోనూ ట్వీట్‌కు ఫిదా! - Mumbai power cut sonu sood tweet
close
Published : 12/10/2020 19:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముంబయిలో పవర్‌కట్‌.. సోనూ ట్వీట్‌కు ఫిదా!

ముంబయి: కొన్ని కారణాల వల్ల ముంబయి నగరంలో సోమవారం ఉదయం రెండు గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తూ.. విద్యుత్‌ శాఖను విమర్శించారు. తెగ కామెంట్లు చేయడంతో #Mumbaielectricity ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. దీంతో అమితాబ్‌ బచ్చన్‌, నిమ్రత్‌ కౌర్‌, అలీ ఫాజల్‌ తదితరులు ముంబయి వాసుల్ని ఉద్దేశిస్తూ ట్వీట్లు చేశారు. దయచేసి మౌనంగా, ఓపికతో ఉండాలని కోరారు. అయితే ఈ విషయంపై సోనూసూద్‌ స్పందించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.

‘ముంబయిలో రెండు గంటలపాటు విద్యుత్‌ లేదని మొత్తం దేశానికి తెలిసిపోయింది. కానీ ఇవాళ్టికి కూడా దేశంలోని అనేక ఇళ్లకు కనీసం రెండు గంటలు కూడా విద్యుత్‌ సరఫరా కావడం లేదు. కాబట్టి దయచేసి ఓపికతో ఉండండి’ అని సోనూ పేర్కొన్నారు. ఆయన ఆలోచించి, మాట్లాడిన తీరుకు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. విద్యుత్‌ సరఫరా రెండు గంటలపాటు ఆగిపోవడంతో నెట్టింట్లో విమర్శలతోపాటు నవ్వులు కూడా పూశాయి. నవ్వించే బాలీవుడ్‌ మీమ్స్‌ను రూపొందించి షేర్‌ చేశారు.

సోనూ ఇటీవల ‘అల్లుడు అదుర్స్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. తెలుగులో ‘సీత’ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా ఇది. బెల్లంకొండ శ్రీనివాస్‌, నభా నటేష్‌ జంటగా నటిస్తున్నారు. అదేవిధంగా ‘పృథ్వీరాజ్‌’, ‘తమిళరసన్‌’ తదితర చిత్రాల్లోనూ సోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని