close
Array ( ) 1

తాజా వార్తలు

అసలు పేరుతో మోహన్‌బాబు

సూర్య సినిమాలో డైలాగ్‌ కింగ్‌ లుక్‌ చూశారా?

హైదరాబాద్‌: సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా!’ అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపీనాథ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కతున్న చిత్రమిది. ఈ సినిమాలో అగ్ర నటుడు మోహన్‌బాబు కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ‘ఆకాశమే నీ హద్దురా’లో మోహన్‌బాబు స్టిల్స్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. విశేషమేమింటే ఈ సినిమాలో మోహన్‌బాబు పోషించిన పాత్ర పేరు భక్తవత్సలం నాయుడు. ఇదే ఆయన అసలు పేరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తమిళ వెర్షన్‌లో తన పాత్రకు మోహన్‌బాబు స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్నారు.

సూర్యకు జంటగా అపర్ణ బాలమురళి నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ‘పిల్లాపులి’ అనే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఊర్వశి, జాకీష్రాఫ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.