IN PICS: కె.విశ్వనాథ్‌ను కలిసిన చిరు - Mega Star Chiru met Legendary Director Vishwanadh
close
Published : 15/11/2020 03:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IN PICS: కె.విశ్వనాథ్‌ను కలిసిన చిరు

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ శనివారం కలిశారు. దీపావళి పండగను పురస్కరించుకుని స్వయంగా ఆయన ఇంటికెళ్లి దంపతలిద్దరూ విశ్వనాథ్‌ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి పండగ వేళ నూతన వస్త్రాలు అందజేశారు. వారి ఆరోగ్యం గురించి ఆరా తీసి కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన చిత్రాలు బయటకొచ్చాయి. ఇందులో చిరంజీవిని ఆప్యాయంగా విశ్వనాథ్‌ దగ్గరకు తీసుకున్న చిత్రం ఆకట్టుకుంటోంది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో వీరి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఆపద్భాందవుడు, స్వయంకృషి వంటి చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించడమే కాక.. మాస్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన చిరంజీవి కెరీర్‌లో క్లాసికల్‌ చిత్రాలుగా నిలిచాయి. విశ్వనాథ్‌ గారిని కలవాలనిపించి ఆయన ఇంటికొచ్చానని ఈ సందర్భంగా చిరంజీవి అన్నారు. తనకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారని, ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా ఆయ‌న్ని క‌ల‌వ‌డం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

\



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని