అమెరికా గాయని ‘దివాళి’ పాట విన్నారా..? - Mary Millben sings Om Jai Jagdish Hare song Diwali 2020
close
Published : 15/11/2020 23:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికా గాయని ‘దివాళి’ పాట విన్నారా..?

న్యూయార్క్‌: మనదేశంలో పండుగలకు ప్రత్యేకంగా పాటలు రాయడం.. వాటిని అందంగా వీడియో రూపంలో తీర్చిదిద్దడం ఈ మధ్య సాధారణమైపోయింది. అయితే ఈసారి దీపావళి కొంత ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే ఈసారి ఓ విదేశీ గాయని ప్రత్యేకంగా దీపావళి కానుకగా స్వయంగా హిందీ పాట పాడింది. అంతేకాదు.. అచ్చంగా ఓ భారతీయ మహిళ అవతారంలో ఆమె కనిపించింది. ‘ఓం జగదీశ హరె’ అనే పాట ఆలపించింది.

అమె పేరు మేరి మిల్బెన్‌. అమెరికన్‌ సింగర్‌, నటి. ఈ వీడియోను ఇప్పటి వరకూ 3.38 లక్షల మంది వీక్షించారు. భారత దేశమన్నా.. దేశ ప్రజలన్నా తనకు ఎంతో ప్రత్యేకమని అంటోందీమె. ఎన్నో అంతర్జాతీయ ప్రదర్శనలు ఇచ్చిన ఆమె.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. దీపావళి సందర్భంగా ఈ ప్రదర్శన చేసే అవకాశం రావడం గొప్ప వరమని ఆమె పేర్కొన్నారు.

ఇదే కాదు.. ది రాక్ఫెల్లర్ ఫౌండేషన్, ది స్కోల్ ఫౌండేషన్ సహకారంతో భారతదేశ జాతీయ గీతాన్ని ఆలపించి, ప్రదర్శించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఆమె గతంలో చేసిన ‘భూమిపై శాంతిని నెలకొల్పుదాం’ అనే కార్యక్రమాన్ని భారత్‌, అమెరికాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆమె ఎన్నో ప్రపంచ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొని ఉపన్యాసాలు ఇచ్చారు. రియో ఒలింపిక్స్‌, మేజర్‌ బేస్‌బాల్‌ లీగ్‌, నేషన్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌, నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌, అమెరికన్‌ వైట్‌హౌస్‌, యునైటెడ్‌ కాంగ్రెస్‌లో ఆమె ప్రదర్శనలు ఇచ్చారు. సంగీతంలో రాణిస్తున్న వారికిచ్చే పురస్కారం హెలెన్ హేస్ అవార్డుకు కూడా నామినేట్‌ అయ్యారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని