సెలబ్రిటీలకు మహేశ్‌ దీపావళి గిఫ్ట్స్‌ - Mahesh Sends Special Gifts To Celebrities
close
Published : 15/11/2020 03:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెలబ్రిటీలకు మహేశ్‌ దీపావళి గిఫ్ట్స్‌

థ్యాంక్స్‌ చెబుతున్న సినీ తారలు

హైదరాబాద్‌: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు.. ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలకు ప్రత్యేక బహుమతులు పంపించారు. ‘ఈ దీపావళిని పురస్కరించుకుని మన ప్రియమైన వారితో సంతోషంగా సమయాన్ని గడుపుదాం. అలాగే వారికి థ్యాంక్స్‌ చెబుదాం. మా కుటుంబం తరఫున మీకు ప్రేమాభిమానాలను అందజేస్తున్నాం. ఈ పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నాం. సురక్షితంగా దీపావళి వేడుకలు జరుపుకోవాలని కోరుతున్నాం’ అని పేర్కొంటూ బహుమతుల‌తోపాటు మహేశ్‌ కుటుంబం ఓ గ్రీటింగ్‌ కార్డును సైతం సెలబ్రిటీలకు పంపించింది.

ప్రత్యేక బహుమతులు అందుకున్న సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా మహీ కుటుంబానికి ధన్యవాదాలతోపాటు దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ మేరకు అడివి శేష్‌, తమన్‌, వరుణ్‌ తేజ్‌, గుణశేఖర్‌ కుటుంబం సోషల్‌మీడియా వేదికగా.. మహేశ్‌ నుంచి స్పెషల్‌ గిఫ్ట్స్‌ అందినట్లు వెల్లడించారు. మరోవైపు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన.. తన కుటుంబసభ్యులకు పండగ సందర్భంగా స్పెషల్‌ గిఫ్ట్స్‌ పంపించారు. ఈ మేరకు అల్లు స్నేహ, నిహారిక, వరుణ్‌ తేజ్‌ ఇన్‌స్టా వేదికగా ఉపాసనకు థ్యాంక్స్‌ చెప్పారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని