అదంతా జుట్టు రంగు మహత్యం: మాధవన్‌ - Madhavan Hilarious reply to a fan about his age
close
Updated : 09/11/2020 10:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదంతా జుట్టు రంగు మహత్యం: మాధవన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన వయసుపై ఓ అభిమాని చేసిన పోస్టుకు నటుడు మాధవన్‌ స్పందించారు. ఆయన ఇటీవల ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే, ఓ వీరాభిమాని ఆ ఫొటో షేర్‌ చేస్తూ.. ‘మాధవన్‌కు రోజులుగడిచే కొద్దీ వయసు తగ్గుతుందే కానీ పెరగడం లేదు’ అని రాసుకొచ్చాడు. ఆ పోస్టుపై స్పందించిన మాధవన్‌.. ‘అదంతా జుట్టుకు వేసుకున్న రంగు మహత్యం’ అని సరదాగా సమాధానం ఇచ్చారు. మాధవన్‌ స్పందనపై అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. నిజాన్ని ఒప్పుకోవడం ఆయన గొప్పతనమని పొగిడేస్తున్నారు. కొంతమంది అభిమానులు.. ‘అది మీ జుట్టుకు వేసుకున్న రంగు గొప్పతనం కాదు.. మీదే’ అని అంటున్నారు.
అనుష్క ప్రధాన పాత్రలో ఇటీవల వచ్చిన టాలీవుడ్‌ చిత్రం ‘నిశ్శబ్దం’లో మాధవన్‌ కీలకపాత్రలో నటించారు. అయితే, అది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. మాధవన్‌ తన తర్వాతి సినిమా చిత్రీకరణలో భాగంగా ప్రస్తుతం దిల్లీలో ఉన్నారు. మరోవైపు తాను నటించిన ‘మారా’ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మలయాళంలో వచ్చిన ‘చార్లీ’ చిత్రానికి తమిళ రిమేక్‌ ఈ సినిమా. దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. గతంలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్నా కరోనా మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది. డిసెంబర్‌ 17న ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధంగా ఉంది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని