close

తాజా వార్తలు

2021 సమ్మర్‌లో ప్రభాస్‌ సినిమా..!

నేను కూడా నటిస్తున్నా: కృష్ణంరాజు

హైదరాబాద్‌: ‘బాహుబలి’, ‘బాహుబలి2’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్నారు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్. గతేడాది విడుదలైన ‘సాహో’ సినిమా తర్వాత ఆయన రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయిక. యూరప్‌లో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ ఇటీవల ప్రారంభమైంది. 

ఇదిలా ఉండగా శనివారం రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు 80వ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల అనంతరం కృష్ణంరాజు విలేకర్లతో ముచ్చటించారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ప్రభాస్‌ని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రభాస్‌ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందని ఆయన ప్రకటించారు. ఈ సినిమాలో తాను కూడా ఓ కీలకపాత్రలో నటించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఓ చక్కటి ప్రేమ కథతో ప్రభాస్ తన అభిమానుల ముందుకు రాబోతున్నట్లు కృష్ణంరాజు తెలిపారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.