close

తాజా వార్తలు

‘కేజీఎఫ్‌ 2’ అభిమానులకు గుడ్‌న్యూస్‌

హైదరాబాద్‌: యశ్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు త్వరలోనే రాబోతుంది. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కేజీఎఫ్‌ చాప్టర్‌2’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే ‘కేజీఎఫ్‌ చాప్టర్1’ విడుదలైన రోజునే ‘కేజీఎఫ్‌ 2’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు డిసెంబర్‌ 21న సాయంత్రం 5.45 గంటలకు ఫస్ట్‌లుక్‌ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి అధీరా లుక్‌ను చిత్రబృందం విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఎలా ఉండబోతోందని ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కన్నడ చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాది సినీపరిశ్రమ స్థాయిని మరో మెట్టు ఎక్కించిన చిత్రం ‘కేజీఎఫ్‌’. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యశ్‌ మాస్‌ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. క్రిస్మస్‌ కానుకగా గతేడాది డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.